PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ప్రభుత్వం అధికారంలో.. కూల్చడాలే తప్ప కట్టడాలు లేవు

1 min read

– వై. నాగేశ్వరరావు యాదవ్  తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తిరుపతి లోని కొర్లగుంట, మధురానగర్ లో తెలుగుదేశం పార్టీ యాదవ సాధికార సమితి కో కన్వీనర్ మధుసూదన్  ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్  అధ్యక్షతన యాదవ పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు సదాశివమ్,యాదవ సాధికార కమిటీ సభ్యులు వేణు యాదవ్,గురప్ప యాదవ్,వెంకటరత్న యాదవ్, రామ్మూర్తి యాదవ్,శంకర్ యాదవ్, యుగంధర్ యాదవ్, చంగల్ రాయుడు యాదవ్ ,బాలరాజులు, తేజకుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వై నాగేశ్వర యాదవ్  మాట్లాడుతూ:-వైసిపి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కాబోతున్న ఇప్పటివరకు చెప్పుకోదగ్గ కట్టడాలు ఏమీ నిర్మించలేదు.నిర్మించిన వాటిని కూల్చడం తప్ప. వైసీపీ ప్రభుత్వం అధికార,ధన దాహంతో పనిచేస్తుంది.వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రజల్లో మరి ముఖ్యంగా బీసీలలో మొదలైంది. అందుకనే వైసిపి నాయకులు ఎక్కడ తిరగాలన్న గుండెల్లో వణుకు పుడుతుంది ప్రజల మధ్యకు రావాలన్న భయపడుతున్నారు. మంచి చేస్తే ఇలా ఎందుకు భయపడుతున్నారు అని వైసిపి నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి చేశాడు కాబట్టి ఈరోజు మహా నాయకుడిలా రోడ్లపై తిరుగుతుంటే జనం నీరాజనం పట్టి నాయకుడిని స్వాగతిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రసిద్ధ కలియుగ వైకుంఠం గా పిలవబడే తిరుమల తిరుపతి ఇస్తే దేవస్థానం చైర్మన్ పదవులను అగ్రవర్ణాల వారికి ఇచ్చి బీసీలకు అన్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించడం జరిగింది. టీటీడీ చైర్మన్ పదవిని యాదవులకు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తుంది. మొదటినుంచి బిసి లు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా ఉండి పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక ఉన్నత పదవులు పదవులను పొందారు కానీ వైసీపీలో మాత్రం అగ్రవర్ణాల వారికి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి కాయం.అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు నర్సింహులుని మర్యాదపూర్వకంగా కలిసి యాదవుల గురించి, యాదవుల సమస్యలను, తెలుగుదేశం పార్టీ గెలుపులో యాదవుల యొక్క పాత్ర, యాదవుల కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.

About Author