రా…. లీలలకు కేంద్ర బిందువు మహానంది క్షేత్రం..?
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది రా… లీలలకు కేంద్ర బిందువు..? అయిందని పలువురు చర్చించుకుంటున్నట్లు సమాచారం. తప్పు చేసిన వారిపై వేటు వేస్తున్నామని పైకి ప్రకటిస్తున్న అది కొంతమందికే వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి రా…. లీలలు 2+1 పద్ధతిలో కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల క్షేత్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన కాలసర్ప దోస నివారణ కొరకు పూజలు నిర్వహించే ప్రాంతం వెనుక భాగాన చీకటిగా ఉండడంతో తమ పని తాము చేసుకోపోతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ఒకరిద్దరు గుర్తించినట్లు సమాచారం. బయటికి పొక్కకుండా ఉండేందుకు కొంత మొత్తాన్ని సమర్పించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా కెమెరాల కంటికి చిక్కకుండా ఆ వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్లు తెలుస్తుంది. అధికారుల దృష్టికి కూడా పోయింది అనే ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం గత కొన్ని రోజుల క్రితం జరిగినట్లు సమాచారం. కళ్యాణమండపం పక్కన ఉన్న సందులో కూడా కొద్ది రోజులు నిరాటంకంగా సాగినట్లు ప్రచారం. ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని మకాం కాలసర్పదోష నివారణ ఆలయం వెనుక భాగానికి మార్చినట్లు గుసగుసలు వినవస్తున్నాయి.