PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో ఎమర్జెన్సీకి మించిన పరిస్థితులు నెలకొన్నాయి..

1 min read

– చంద్రబాబు అరెస్టు అన్యాయం..కళ్ళకు నల్ల రిబ్బను కట్టుకొని వినూత్న నిరసన..

– ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  విజనరీ నాయకుడు చంద్రబాబు వెన్నంటే ఉంటామని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బడేటి చంటి పేర్కొన్నారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏలూరు చేపల తూము సెంటర్లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో బడేటి చంటి పాల్గొన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలసి కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీకి మించి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని ప్రతి గొంతూ తన గళం విప్పుతుంటే సైకో జగన్ కు వణుకు పుడుతోందని పేర్కొన్నారు. రాజకీయంగా చంద్రబాబుని ఎదుర్కొనే శక్తి లేక అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురిచేయాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపించారు. స్కిల్ కంపెనీ కుట్రతో లబ్ధి పొందాలని భావించిన వైసీపీ ప్రభుత్వ పన్నాగం విఫలం కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శాడిస్ట్ జగన్ ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ప్రజాబలం ముందు ఎటువంటి కుట్రలు నిలవవనే నిజాన్ని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు గ్రహించాలన్నారు. రోజురోజుకు చంద్రబాబుకు మద్దతుగా ప్రజా విప్లవం పెరిగిపోతోందని, ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకు వచ్చి తమ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. మొన్నటివరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులు చేసిన అరాచకాలను ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చీదరించుకోవడంతో సోషల్ మీడియా తునాతునకలు అయిపోయిందని బడేటి చంటి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. క్లస్టర్ 1 ఇంచార్జ్ అమరావతి అశోక్, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు,  మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

About Author