మునుపెన్నడూ లేనివిధంగా కర్నూలును అభివృద్ధి చేస్తా.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మునుపెన్నడూ లేనివిధంగా కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 3వ వార్డు పరిధిలోని సాగమండిలో ఆయన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. టిడిపి మినీ మేనిఫెస్టో కరపత్రాలు ప్రజలకు అందించి.. టిడిపి ప్రభుత్వం వస్తే ప్రజలకు అందే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ప్రజలకు మంచి పాలన అందుతుందన్నారు. తాను గెలిస్తే కర్నూల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన సాగిస్తానని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల నుండి అనూహ్య రీతిలో మద్దతు లభిస్తోందన్నారు. ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా గౌరి గోపాల్ హాస్పిటల్ లో ప్రజల కోసం ఉచితంగా చేయిస్తున్న వైద్య పరీక్షల కరపత్రాలు అందించారు. ప్రతి 100 మందిలో 10 మందికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జీ నాగ వీరాంజనేయులు, ఉమామహేశ్వరి, చంద్రకాంత, నాగరాజు, విజయ్, గౌస్, నరేష్, హరికృష్ణ రావ్, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.