స్పందన అర్జీ దారులకు శాశ్వత పరిష్కారం చూపాలి అధికారులు
1 min read– జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశo…
పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి : భీమవరం సోమవారం స్థానిక కలెక్టరేటు స్పందన సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుండి వచ్చిన అర్జీదారులను జిల్లా కలెక్టరు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు మళ్లీ రీఓపెన్ అవ్వని విధంగా పరిష్కారం చూపాలన్నారు. మండల స్థాయిలో స్పందన కార్యక్రమం అత్యంత భాధ్యతతో నిర్వహించినట్లయితే జిల్లా స్పందన కార్యక్రమంకు ఎక్కువ ప్రజలు వచ్చే అవకాశం ఉండదని, మండల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సుదూర ప్రాంతాల నుండి మన మీద నమ్మ కంతో వారి సమస్యల పరిష్కారానికి వస్తారని, దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు శాంతియుత వాతావరణంలో త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు.సోమవారం స్పందన ద్వారా 346 అర్జీలు అందాయని వాటిలో కొన్ని దరఖాస్తులు ఇలా నరసాపురం మండలం రుస్తుంభాద అంబేద్కర్ నగరు నివాసి వట్టిప్రోలు సతీష్ మురుగునీరు, చెత్తాచెదారం రోడ్డుపైకి వదులుతున్నారు. తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. విచారణ చేసి పరిష్కారం చూపగలరు.వీరవాసరం మండలం నవుడూరు గ్రామ నివాసి అంచూరి దుర్గమణి పద్మిని, అంచూరి అశ్విని. మా అమ్మమ్మ ఇచ్చిన స్థలంలో మేము ఇల్లు కట్టుకొనుటకు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు. పరిష్కారం చూపి ఇల్లు కట్టుకునే భాగ్యం కల్పించండి.భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామనివాసి గరికపూడి రమణమ్మ. ఇంటి స్థలం కోసం అనేక సార్లు దరఖాస్తు పెట్టాను. రెండు సంవత్సరాల పూర్తయింది నాకు ఇంటి స్థలం మంజూరు కాలేదు.ఇప్పించగలరు. ఇరగవరం మండలం రాపాక గ్రామ నివాసి.పంపన లక్ష్మణరావు నా పొలాన్ని ఆక్రమించుకున్నారు. నేను దివ్యాంగుడను నా పొలం నాకు ఇప్పించవలసిందిగా కోరి యున్నారు. యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ నివాసి కారిపల్లి లక్ష్మి అనురాధ. ప్రాథమిక పాఠశాల వంటశాల అయాగా ఇస్తానని చెప్పారు. చివరి నిమిషంలో వేరే ఆవిడకి ఇచ్చారు. నా భర్త దివ్యాంగుడు, నేను నిరుపేద కుటుంబం నాకు అవకాశం కల్పించండి అంటూ వేడుకొన్నారు.జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి కె.కృష్ణవేణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, డియల్డివో కెసిహెచ్ అప్పారావు, డియస్పి బి. శ్రీనాథ్ లు, ఆర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ అప్పిలేటు ట్రిబ్యునల్ మెంబరు మేళం దుర్గా ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.