డిప్యూటీ తాసిల్దార్… విఆర్ఓను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
1 min read– డా. మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా భూములను నమోదు చేసిన డిప్యూటీ తాసిల్దార్ వై. శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన సర్వే నెం.929లో 10.04 ఎకరాల విస్తీర్ణ దేవాదాయ భూములను రెవెన్యూ రికార్డులో తారుమారు చేసిన డిప్యూటీ తాసిల్దార్ వై శ్రీనివాసులు సస్పెండ్ చేసామన్నారు. అలాగే ఇందుకు పాల్పడిన 80 బన్నూర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వెంకటరమణను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు వీరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.