ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అవగాహన కార్యక్రమం..
1 min readఆయుష్మాన్ భారత్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యాఫ్పై ఇన్స్టాల్ చేయుట..
వాలంటరీలకు సమావేశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 1 నుండి 79 సచివాలయములలో పనిచేయుచున్న వాలంటీర్లకు 28వ తేదీ శనివారం ఉ. 10.30 గంటలకు నగరపాలక సంస్థ పాత కౌన్సిల్ హాల్ నందు సచివాలయం నెంబర్ 40 నుండి 49 వరకు సచివాలయములకు, అదేవిధంగా తదుపరి మ. 11.30 నుండి 12.30 గం. లకు 50 నుండి 59 సచివాలయాలకు మరియు సా.4.00 గంటలకు సచివాలయం నెం. 60నుండి 62, శనివారం పేట-1.,2.,3.,4., మరియు తంగెళ్ళమూడి-1, తంగెళ్ళమూడి-2 సంబంధించిన వాలంటీర్లకు మూడు దాఫాలుగా సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశమునకు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మహలతి హాజరయ్యారు. మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము 1.ప్రైమినిస్టర్ జన ఆరోగ్య యోజన-PMJAY -ఆయుష్మాన్ భారత్, 2.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రెండు App ల ఇన్స్టాల్ చేయటం, 3.PMJAY ఎన్రాన్మెంట్ EKYC మోనిటర్ చేయటం, 4.క్లాప్ యూజర్ ఫీ కలెక్షన్ అవగాహన గురించి వివరించరు. సంబంధిత సచివాలయ వాలంటీర్లు హాజరు అయ్యారు.