మోడీపై రాహుల్ విమర్శలు… ఉత్తుత్తి శాఖ అంటూ ఎద్దేవా
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రధాని నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ విమర్శల బాణం సంధించారు. ట్విట్టర్ వేదికగా సునిశిత విమర్శలు చేశారు. భారత ప్రభుత్వంలోని సమర్థవంతమైన శాఖ ఏది ?. అంటే.. అది.. అబద్దాల, ఉత్తుత్తి నినాదాలతో కూడిన సీక్రెట్ మంత్రిత్వ శాఖ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. కోవిడ్ తర్వాత నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మీద నిమ్మకునీరెత్తినట్టు కూర్చున్న వ్యక్తి ఎవరో అందరికీ తెలుసని రాహుల్ విమర్శించారు. ఆదివారం నాడు ట్విట్టర్ లో మోదీ పై విమర్శలు గుప్పించారు.