అల్లర్లు సృష్టిస్తే.. ఉపేక్షించను..
1 min read– ఎస్ఐ నాగార్జున రెడ్డి
పల్లెవెలుగు వెబ్, మహానంది: గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షిమించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి . ఆదివారం పోలీస్స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా.. బెదిరింపులు.. దౌర్జన్యాలకు దిగినా.. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి జీవించాలని, నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే మండలంలోని రౌడీషీటర్లు, ఆకతాయిల వివరాలు సేకరించామని, వారిపై నిఘా ఉంచామని ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు.