అంతర్జాతీయ స్థాయి గౌతమ్ బుద్ధ గోల్డెన్ పీస్ అవార్డు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నైజీరియా దేశానికి చెందిన అంతర్జాతీయ సంస్థ డైనమిక్ పీస్ రెస్క్యూ మిషన్ ఇంటర్నేషనల్ సంస్థ గ్లోబల్ కమాండెంట్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ అంబాసిడర్ ఏబోరియా చార్లెస్ నుండి నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అంతర్జాలంలో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు గుర్తింపుగా ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి గౌతమ బుద్ధ గోల్డెన్ పీస్ అవార్డును అందజేశారు.2021-22 సంవత్సరానికి గాను ఈ అవార్డు రావడం జరిగిందని ఇంటర్నేషనల్ నైస్ నెట్వర్క్ ఇండియా ప్రతినిధిగా ప్రపంచ శాంతి ,మానవ హక్కుల పై అవగాహన కార్యక్రమాలను అంతర్జాలం ద్వారా వివిధ దేశాల అంతర్జాతీయ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నామన్నారు.