PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూమి లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత

1 min read

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

కర్నూలు: భూమి లేని నిరుపేదలకు  రాష్ట్ర ప్రభుత్వం  చేయూత అందించడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. గురువారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో  రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏలూరులో భూమి పంపిణీ చేయనున్న సందర్భంగా జిల్లాలో  భూ పంపిణీ వివరాలను  (డిపట్టాలు, ఫ్రీ హోల్డ్ ఇనామ్, విలేజ్ సర్వీస్ ఇనామ్, స్మశాన వాటికల వివరాలను) జాయింట్ కలెక్టర్  పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్  మాట్లాడుతూ భూమి లేని నిరుపేదలకు జిల్లాలో 2582 మంది లబ్దిదారులకు 3002.18 ఎకరాల (ఆదోని డివిజన్ లో  1330 మంది లబ్దిదారులకు – 1375.45 ఎకరాలు, పత్తికొండ డివిజన్ లో 932 మంది లబ్దిదారులకు – 1203.99 ఎకరాలు, కర్నూలు డివిజన్ లో 320 మంది లబ్ధదారులకు – 422.74 ఎకరాల) కొత్త డి పట్టాలను  పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.

20 ఏళ్లు దాటిన వారికి.. ఫ్రీహోల్డ్​ హక్కు:

ఫ్రీహోల్డ్ అసైన్‌మెంట్ భూములకు సంబంధించి  అసైన్మెంట్ ఇచ్చి 20  ఏళ్లు దాటిన వారికి ఫ్రీహోల్డ్ హక్కులు కల్పిస్తూ 22(ఎ) నుంచి  తొలగించడం (డినోటిఫై) చేయడం జరుగుతుందన్నారు.  విఆర్ఓలు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ స్థాయిలో పరిశీలించి వెరిఫై చేసి డిపట్టాలు ఇచ్చినట్టు రుజువైతే వారి వారసులు ఉంటేనే తొలగించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి  ఆదోని డివిజన్ లో 484 మంది లబ్దిదారులకు – 702.71 ఎకరాలు, పత్తికొండడివిజన్ లో   2277 మంది లబ్ధదారులకు – 4540.57 ఎకరాలు, కర్నూలు డివిజన్ లోల 342 మంది లబ్ధదారులకు – 538.095ఎకరాలకు  ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించడం జరుగు తోందన్నారు.

గ్రామ సర్వీస్​ ఇనామ్​ల తొలగింపు… :

గ్రామ సర్వీస్ ఇనామ్‌లకు 22(ఎ) నుంచి  తొలగించడానికి సంబంధించి 15191 మంది లబ్ధిదారులకు  23,838.92  ఎకరాలు (ఆదోని డివిజన్ లో 3328 మంది లబ్దిదారులకు – 5390.78 ఎకరాలు, పత్తికొండ డివిజన్ లో 2889 మంది లబ్దిదారులకు – 5944.00 ఎకరాలు, కర్నూలు డివిజన్ లో 8974 మంది లబ్దిదారులకు – 12,504.14 ఎకరాలు) సర్వీస్ ఇనామ్‌ తొలగించడం జరుగుతోందన్నారు.

ల్యాండ్​ పర్జేజ్​ స్కీం…రిజిస్ర్టేషన్​:

ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద గతంలో ఎస్సీ కార్పొరేషన్ వారు 2008లో మార్టిగేజ్ చేసుకున్న భూములను లబ్ధిదారుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో  1762 మంది లబ్దిదారులకు 2794 ఎకరాల్లో వారికి రిజిస్ట్రేషన్ చేసి వారికి సొంత హక్కులు కల్పించడం జరుగుతోందన్నారు.

103 స్మశాన వాటికలు.. :

ఎస్సీ కమ్యూనిటీ వారికి 103 స్మశాన వాటికలు గుర్తించడం జరిగిందని వాటిని తహశీల్దార్లు, గ్రామ పంచాయతీలకు అందజేయడం జరుగుతుందన్నారు. (ఆదోని డివిజన్ లో 34 మంది లబ్దిదారులకు – 18.52 ఎకరాలు, పత్తికొండ డివిజన్ లో 66 మంది లబ్ధదారులకు – 34.29 ఎకరాలు, కర్నూలు డివిజన్లోని 3 మంది లబ్ధదారులకు – 1.96ఎకరాలు) అదే విధంగా స్వామిత్వలో వచ్చిన గ్రామ కంఠం సర్వే చేసి  20 వేల ప్రాపర్టీ కార్డులను కూడా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.

ఏలూరులో ప్రారంభం… :

ఈ కార్యక్రమాన్ని  ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించిన తరువాత  జిల్లా స్థాయిలో ఈ నెల 18 వ తేదీ నుంచి  ఒక వారం రోజుల పాటు ప్రజా ప్రతినిధులతో పంపిణీ చేయించడం జరుగుతుందని జేసీ వివరించారు.

About Author