గాయత్రీ గోశాలకు రూ. 1 లక్ష విరాళం
1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర శివారులోని గాయత్రీ గోశాలకు అమెరికాకు చెందిన ప్రసన్న లక్ష్మి రూ. 1 లక్ష విరాళం అందించారు. కర్నూలు నగరంలోని మౌర్య ఇన్లో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ చేతుల మీదుగా గాయత్రీ గోసేవ సమితి అధ్యక్షుడు జగదీష్ గుప్తాకు అందజేశారు. గాయత్రీ గోశాల నిర్వహణ కోసం విరాళం ప్రకటించినందుకు టి.జి భరత్.. ప్రసన్న లక్ష్మిని అభినందించారు. నార్త్ అమెరికా ఇండియన్ వాసవి అసోసియేషన్ తరుపున కూడా గాయత్రీ గోశాలకు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆమె టి.జి భరత్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లూరు లక్ష్మయ్య, శేషఫణి, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

