PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాటిచ్చారంటే – చేస్తారంతే..

1 min read

దెందులూరు శాసనసభ్యులు, వైయస్సార్ పార్టీ అధికార ప్రతినిధి కొట్టారు అబ్బయ్య చౌదరి

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రత్యేక విజ్ఞప్తికి మేరకు సబ్ స్టేషన్ ను మంజూరు చేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి

రూ:139.66/- కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి, ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : కొప్పాకలో రూ.139.66 కోట్లతో నిర్మించనున్న 220/132/33 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ కు నేడు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డివర్చువల్ గా శంకుస్థాపశాశ్వతంగా తీరనున్న దెందులూరు ప్రజల కరెంట్ కష్టాలు  దెందులూరు పర్యటన సందర్భంగా ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జగనన్న.పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో రూ.139.66 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/132/33 కె.వి. సబ్ స్టేషన్ కు మరియు సంబంధిత లైను పనులకు గౌరవ సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  వర్చువల్ గా శంకుస్థాపన చేసారు. కొప్పాక నుండి ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, జెడ్పీ చైర్మన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి , AMC చైర్మన్ అప్పన ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన దెందులూరు పర్యటన సందర్భంగా ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, “మాటిచ్చారంటే – చేస్తారంతే” అని మరోసారి రుజువు చేశారని అన్నారు. ఈ సబ్ స్టేషన్ ను అధికస్థాయి ఓల్టేజి సామర్థ్యముతో (220/132/33 కె.వి) నిర్మిస్తున్న కారణంగా, ఏలూరు, పెదవేగి, పెదపాడు, దెందులూరు మండలాల్లోని రైతన్నల పంట పొలాలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని, పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా అవుతుందని, అలాగే గృహావసరాలకు కరెంట్ కోతలు లేకుండా చాలా సౌకర్యం ఏర్పడుతుందని అబ్బయ్య చౌదరి  తెలిపారు. దెందులూరులోని సమస్యలకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి  చాలా శ్రద్ధ తీసుకొని శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారని ప్రజలు ప్రశంసిస్తూ, ఎమ్మెల్యే  ప్రత్యేక విజ్ఞప్తికి మేరకు సబ్ స్టేషన్ ను మంజూరు చేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author