PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతనంగా నగరంలో రుక్మిణి షోరూం ప్రారంభం..

1 min read

– విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ పెదబాబు..

– సందర్శించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలు చేసిన యాజమాన్యం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ఏలూరు నగరంలోని ప్రభావతి హాస్పిటల్ రోడ్ లో రుక్మిణి సిల్క్స్ షోరూంను మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ నాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నానికి కేరళ తరహా మేళా తాళాలతో ఘన స్వాగతం లభించింది. అనంతరం షోరూంలో జ్యోతి ప్రజ్వలన చేసి లోపల ఉన్న వస్త్ర సముదాయాన్ని తిలకించారు. రుక్మిణి సిల్క్స్ షోరూం అధినేత నందనం పార్థసారథి అతిధులకు ఘన స్వాగతం చెప్పారు. ఇదే కార్యక్రమానికి ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు విచ్చేసి లేడీస్ విభాగాన్ని ప్రారంభించారు. యాజమాన్య కుటుంబ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి సరికొత్త వెరైటీలు మేయర్ కు చూపించారు, వారితో రాష్ట్ర సాహితి అకాడమీ పిళ్ళo గోళ్ల శ్రీలక్ష్మి వస్త్ర సముదాయాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అంబిక కృష్ణ, ఏలూరు నగర టిడిపి ఇన్చార్జి బడేటి రాధాకృష్ణ షోరూమ్ సందర్శించి పార్థసారధిని అభినందించారు. పెనుగొండ కామరాజు,మూర్తి పలువురు షోరూం అధినేతను వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందాలని అభినందించారు.

About Author