PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్​వాడీ దీక్షకు…బీజేపీ మద్దతు..

1 min read

నందికొట్కూరు, పల్లెవెలుగు: నందికొట్కూరు లోని అంగన్వాడీ టీచర్ల నిరాహార దీక్షకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చల్లా దామోదర్ రెడ్డి  సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చల్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలు గ్రామానికి బాడీగా పని చేస్తున్నారని ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిటికీ సహకరిస్తున్నారని అటువంటి వ్యక్తులకు తెలంగాణకు అంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటివిటీ ఇవ్వాలని రిటర్మెంట్ ఐదు లక్షల ఇవ్వాలని వేతనంలో సగభాగం పెన్షన్ ఇవ్వాలని అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తించాలని ప్రమోషన్లలో రాజకీయ జోక్యం తగ్గించుకోవాలని 300 జనాభా దాటిన మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని పిల్లలకు యూనిఫామ్ అమ్మఒడి ఇవ్వాలని సర్వీసులో ఉండే చనిపోయిన వాళ్లకు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు న్యాయమైన కోరికలు కోరుతున్నారని వాళ్లు కోరిన కోరికలు అన్నిటిని ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చల్లా దామోదర్ రెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ కోరారు వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

About Author