ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
1 min readమంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి పాలకుర్తి తిక్కారెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : వైసిపి ప్రభుత్వం పరిపాలనలో , అభివృద్ధి చేయడంలో విఫలమైందని అభివృద్ధి, మంచి సంక్షేమ పరిపాలన ప్రజలకు అందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మంత్రాలయం టౌన్ లో క్లస్టర్ ఇన్ ఛార్జ్ యల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి వైకాపా ప్రభుత్వ అరాచక పాలన గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు, మహిళలకు, యువతకు ఇస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. నాకు రానున్న ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని మంత్రాలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పాలకుర్తి తిక్కరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి, ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం మాజీ డైరెక్టర్ వ్యాసరాజ స్వామి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి, పవన్ కుమార్, వట్టెప్ప గారి నరసింహులు, ఎం పి టి సి సభ్యులు మేకల వెంకటేష్,చిన్న భీమ, సుంకప్ప , హనుమంతు,యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి యోబు, పేతురు ,శివ తదితరులు పాల్గొన్నారు.