గోనెగండ్ల లో దారుణ హత్య..
1 min readపల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల: మండలకేంద్రమైన గోనెగండ్ల లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య ప్రియుడు మృతి చెందగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గోనెగండ్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..నాగరాజు అనే వ్యక్తి భార్య ఉరుకుందమ్మ గత కొన్నాళ్లుగా బజారీ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. దీంతో కోపం పెంచుకున్న నాగరాజు వారిద్దరిపై కత్తి, బండరాళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బజారీ అక్కడికక్కడే మృతి చెందగా, ఉరుకుందమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు అక్రమ సంబంధమే కారణం అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు.