మిని జాబ్ మేళా కు విశేష స్పందన
1 min readప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి :- సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతీ యువకులకు అనేక అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. :- ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి:-
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు:- ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్.
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ మరియు కన్వెన్షన్ సెంటర్ నందు, విమల రీజెన్సీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ అథారిటీ మరియు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వారి సహకారంతో యువతీ, యువకుల కొరకు మినీ జాబ్ మేళాను ఆదివారం నిర్వహించారు. ముందుగా సబ్ కలెక్టర్, ఆదోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.ఈ సందర్భంగా ఆదోని శాసనసభ్యులు వై.సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతీ యువకులకు ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి దోహదపడే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో రాణించాలని ఎమ్మెల్యే యువతకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వార 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులలో బాగంగా విమల 5 స్టార్ హోటల్ మరియు కన్వెన్షన్ సెంటర్ ఆదోనిలో ఏర్పాటు కావడం విశేషమని పేర్కొన్నారు. ఇందుకుగాను 250 మంది యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని అన్నారు. అంతే కాక అభివృద్ధిలో భాగంగా ఆదోనికి బైపాస్ రోడ్డు, మరియు మెడికల్ కాలేజ్ రావడం ఆదోని అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ యజమాని పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… మాతృభూమికై సేవ చేయాలన్న తపనలో భాగంగా 100 కోట్లు పెట్టుబడులతో ఫైవ్ స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ తో పాటు ఫుడ్ కోర్ట్, రెస్టారెంట్లు, హెల్త్ క్లబ్, వెల్నెస్ సెంటర్, ఫ్యాషన్ స్టోర్స్ మరియు సూపర్ మార్కెట్ తో ఏర్పాటు చేశామన్నారు. వీలైనంత మేరకు అనేక అభివృద్ధి పనులకు తోడ్పడుతానని అన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగ ఉత్పత్తులను ఎగుమతులు దిగుమతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.అనంతరం సంస్థ వారి ఆధ్వర్యంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే వై .సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ మరియు కన్వెన్షన్ సెంటర్ యజమాని పవన్ కుమార్ రెడ్డిస్కిల్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్, పర్యాటకశాఖ డైరెక్టర్ గోపాల్, ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సొసైటీ సీఈవో హేమలత రాణి, తదితరులు పాల్గొన్నారు.