PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాటు సారా.. అక్రమ మద్యం నిర్మూలనే లక్ష్యం

1 min read

బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత..

20 మధ్యం బాటిళ్లు,ఒక మోటార్ సైకల్ స్వాదీనం..

పలుమార్లు కేసులలో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిక.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి ఐపీఎస్  ఆదేశాలమేరకు ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు మరియు ట్రాఫిక్ నియంత్రించుటకు మరియు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాటు సారా ,అక్రమ మద్యం నివారణే లక్ష్యంగా పోలీసులు చేస్తున్న విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా నేడు బ్రాహ్మణకోట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేమాను  గ్రామం ఊరిబయట వాహనాలను ఎస్సై నాగార్జున వారి సిబ్బంది సహాయంతో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక  వ్యక్తి అక్రమంగా 20 మద్యం బాటిళ్లును తరలిస్తుండగా బ్రాహ్మణకొట్కూరు పోలీసులు పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది.అతని వద్ద నుండి 18 రాయల్ స్టాగ్, రెండు ఓల్డ్ మాంక్ బాటిళ్లను ,ఒక మోటార్ సైకిల్ ను ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సై నాగార్జున తెలిపారు.

About Author