నూతన SC కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min read– 2వ వార్డ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, నగర మేయర్ బి.వై రామయ్యా నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ స్థానిక వార్డ్ ఇంచార్జి జిల్లా వాక్ఫ్ బోర్డు మెంబర్ ఫైరోజ్ , ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీ నాయకులు.. అంచనా మొత్తం 70లక్షలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నగరం లోని 2వ వార్డ్ లో నూతన SC కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం జరిగింది. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్ని అన్నారు. జగనన్న చెప్పే విధంగా నా SC ST BC MINORITY చెప్పే విధంగా ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నారని అన్నారు.అలాగే నగర అభివృద్ధి మన ప్రభుత్వంలోనే జరిగిందని అన్నారు. జోహారాపురం,ఆనంద్ టాకీస్,బిర్లా గేట్ నందు ఉన్న బ్రిడ్జ్ లు,పార్క్స్,పాఠశాలలు, స్మశాన వాటికలు,నూతన నీటి పైప్ లైన్,పురాతన దేవాలయాల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం,ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడం,రోడ్స్,డ్రైనేజ్,వైస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్, మరియు వైస్సార్సీపీ నాయకులు SC ST నాయకులు మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో మన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అందించిన సేవలు మరువలేనివి అని అన్నారు. ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా నగర ప్రజల సమస్యలను తీరిచెందుకు కృషి చేస్తారని అన్నారు. కర్నూల్ నగర అభివృద్ధి కేవలం మన జగనన్న ప్రభుత్వం హాఫిజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో జరిగిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల నుండి జగనన్న ప్రభుత్వం లో 50% మహిళలకు నామినేట్ పదవులు కేటాయించడం నగరం లో sc మహిళకు డిప్యూటీ మేయర్, కో ఆప్షన్ మెంబర్, పలు నామినేట్ పదవులు కేటాయించి మమ్మల్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మేము సిద్ధం మళ్ళీ జగనన్న ను ముఖ్యమంత్రిగా హాఫిజ్ ఖాన్ గారికి ఎమ్మెల్యే గా గెలిపించేందుకు మేము సిద్ధం అన్ని అన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక వార్డ్ నాయకులు కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.