ఘనంగా శ్రీమతి పావని లత అంతిమయాత్ర…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అవయవదాత, నలుగురికి ప్రాణదాత శ్రీమతి పావని లత చివరి మజిలీ యాత్ర నగరంలోని స్వచ్ఛంద సంస్థ లు, సామాజిక స్పృహ ఉన్న అనేకమంది పుర ప్రముఖులు రాజకీయ నాయకులు బాలాజీ నగర్ లోని పావని లత ఇంటి వద్దకు వచ్చి పార్టీవ దేహానికి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా సంఘం నాయకులు కళాకారులు దారి పొడుగున పాటలు పాడుతూ వీడ్కోలు పలికారు.వెంకటరమణ కాలనీలో ఉన్న కేశవరెడ్డి స్కూల్, శ్రీ లక్ష్మీ స్కూల్, కేఎన్ఆర్ స్కూల్ విద్యార్థులు పావనిలత అంతిమయాత్ర పై రోడ్డుకు ఇరువైపులా నిలుచుకొని పుష్పాలు చల్లుతూ వీడ్కోలు పలికారు. కె వి ఆర్ ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అధిక సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి పుష్పగుచ్చాలతో అంతిమయాత్రలో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి సురేష్ కుమార్, మానవత కన్వీనర్ మనోహర్ రెడ్డి, మహిళా కమిటీ కన్వీనర్ యాని ప్రతాప్, అపర్ణ, దీప ,లక్ష్మి,రాజు, రేణుక,రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గోవిందరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ విజయ కుమార్ రెడ్డి, అవోపా నాయకులు, యుగంధర్ ప్రసాద్ గౌడ్, హరికిషన్, బజరంగ్ దల్ నాయకులు ప్రతాప్ రెడ్డి, శేషయ్య, జన విజ్ఞాన వేదిక అనంతపూర్ కళాకారులు రాజు బృందం పావని లత అవయవ దానం పై పాడిన పాటలు జనం లో మంచి అవగాహన కలిగించాయి.