గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి పార్టీ అధికారంలోకి రావాలి
1 min readటిడిపి పత్తికొండ ఇన్చార్జి శ్యాం కుమార్ స్పష్తీకరణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్యాం కుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం తుగ్గలి మండలం ఉప్పర్లపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి గారు పత్తికొండ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని అన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసి నియోజకవర్గ ప్రజలు ఈసారి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నియోజకవర్గ ఇంచార్జి కేఈ శ్యామ్ కుమార్ ప్రతి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. జగన్ ప్రభుత్వం సర్పంచుల నిధులు కూడా నొక్కేసి గ్రామాలను అంధకారంలోకి నెట్టేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు కావలసిన నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి అభివృద్ధి పరచారాని తెలిపారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సచివాలయాలు అంటూ చెప్పి సర్పంచులకు నిధులను ఇవ్వకుండా గ్రామాలను అంధకారంలోకి నెట్టేశారని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కేఈ శ్యామ్ కుమార్ విమర్శించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో పయనిస్తుందని, అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని అందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేయ్యాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల నాయకులు,ఉప్పర్లపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.