NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోచం రెడ్డి పల్లి కృష్ణారెడ్డి మృతికి సాయినాథ్ శర్మ నివాళులు   

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప: వీరపనాయన పల్లె మండలం పోచంరెడ్డి పల్లె గ్రామానికి చెందిన సాయినాథ్ శర్మ అనుచరుడు భార్గవ రెడ్డి మేనమామ  చప్పిడి కృష్ణారెడ్డి ప్రమాదవశాత్తు మరణించడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ గురువారం సాయంత్రం ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో ఎంతో మంచి పేరు తెచ్చుకొని కష్టపడి పనిచేసుకుంటున్న కృష్ణారెడ్డిని. విది కబళించడం చాలా విచారకరమన్నారు. వారి కుటుంబ సభ్యులను ఆయన కుమారుడు విష్ణురెడ్డి ని సాయినాథ్ శర్మ ఓదార్చారు. తన పట్ల ఎంతో ప్రేమ అభిమానాలు చూపిన కృష్ణారెడ్డి కుటుంభానికి తనకు చేతనైనంత వరకు చేయూతనిస్తానన్నారు. సాయినాథ్ శర్మతోపాటు అడవి చెర్లపల్లి సర్పంచ్ చిన్న నారాయణరెడ్డి యువనాయకులు కృష్ణారెడ్డి లక్ష్మీరెడ్డి, లేటపల్లే సుబ్బారెడ్డి కృష్ణా రెడ్డి కి నివాళులర్పించారు.

About Author