PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడ‌క్షన్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలుగ‌నాట ఎన్నో అద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించిన సంస్థ సురేష్ ప్రొడ‌క్షన్స్. ద‌గ్గుబాటి రామానాయుడు ఈ సంస్థ వ్యవ‌స్థాప‌క‌డు. తెలుగులోనే కాకుండా చాలా భార‌తీయ భాష‌ల్లో సినిమాలు నిర్మించి.. ఎంతో ఘ‌న‌త సొంతం చేసుకుంది సురేష్ ప్రొడ‌క్షన్స్. సినిమా నిర్మాణం, స్టుడియో, డిస్ట్రిబ్యూష‌న్, ఎగ్జిబిష‌న్, పంపిణీ ల్యాబ్ లాంటి వివిధ రంగాల్లో అడుగుపెట్టి స‌క్సెస్ అయింది. ఇప్పుడు సంగీత ప‌రిశ్రమ‌లోకి కూడ అడుగు పెట్టాల‌ని సురేష్ ప్రొడ‌క్షన్స్ భావిస్తోంది. ‘ఎస్పీ మ్యూజిక్’ బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లోకి వ‌స్తోంది. మ‌న సినిమాల‌కు సంగీతం ప్రాణ‌మని, సంగీతాన్ని ప్రత్యేకంగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌న్న ఉద్దేశంతో ఎస్పీ మ్యూజిక్ పేరుతో వ‌స్తున్నామ‌ని సురేష్ బాబు తెలిపారు. మంచి సంగీతానికి ఎస్పీ మ్యూజిక్ వేదిక కావాల‌ని కోర‌కుంటున్నట్టు ఆయ‌న అన్నారు.

About Author