హోటల్ బిల్లు కొంచెం.. టిప్ 11 లక్షలు !
1 min readపల్లెవెలుగు వెబ్: హోటల్ కో.. రెస్టారెంట్ కో వెళ్లినప్పుడు సర్వర్ లు టిప్పు అడుగుతుంటారు. ఇచ్చే వారు ఇస్తారు. మరికొందరు ఇవ్వరు. కానీ అమెరికాలోని న్యూ హాంప్ షైర్ లోని ఓ రెస్టారెంట్ లో సర్వర్ కి ఇచ్చిన టిప్.. అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. న్యూ హాంప్ షైర్ లోని స్టంబుల్ ఇన్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్ కు ఒక వ్యక్తి వచ్చి.. ఆయనకు కావాల్సిన డ్రింక్, ఆహారాన్ని ఆర్డర్ చేశారు. ఓ మహిళా సర్వర్ ఆయన ఆర్డర్ ని తెచ్చిపెట్టింది. ఆయన మొత్తం బిల్లు 2700 అయింది. కానీ .. అతను 11లక్షల టిప్పు చెల్లించాడు. దీంతో ఆ సర్వర్ , రెస్టారెంట్ ఓనర్ షాక్ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో టిప్ ఇచ్చిన వ్యక్తి.. తన వివరాలు మాత్రం బహిర్గతపరచలేదు. ఆ రెస్టారెంట్ యజమాని ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో అందరి నోట ప్రశంసల జల్లు కురుస్తోంది.