ప్రశాంత ఎన్నికలే లక్ష్యం…కర్నూల్ జిల్లా ఎస్పీ
1 min readప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
పుచ్చకాయలమాడ గ్రామంలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పత్తికొండ యుపిస్ పోలీసులు పుచ్చకాయలమాడ గ్రామంలో కవాతు నిర్వహించారని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.సార్వత్రిక ఎన్నికలు-2024 దృష్టిలో ఉంచుకొని పత్తికొండ డిఎస్పి శ్రీనివాసరెడ్డి మరియు పత్తికొండ సీఐ కె .మురళీమోహన్, ఎస్సై సి . వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పత్తికొండ సబ్ డివిజన్ , పత్తికొండ యుపిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుచ్చకాయలమాడ గ్రామo లో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసు అధికారులు కవాతు నిర్వహిస్తూ, గ్రామ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారన్నారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడానికి ప్రధాన కారణం…
గ్రామాలలో ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి 100 మంది కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారు.ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ తెలిపారు.