PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కత్తి మహేష్ పరిస్థితి విషమం

1 min read

పల్లెవెలుగు వెబ్​ : చెన్నై – కలకత్తా రహదారిలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్​కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో మహేష్​ తలకు బలమైన గాయాలయ్యాయి. అతడి డ్రైవర్​ ఇచ్చిన సమాచారంతో పెట్రోలింగ్​ పోలీసులు కత్తి మహేష్​ గా గుర్తించారు. చికిత్స నిమిత్తం నెల్లూరు మెడికవర్​ ఆస్పత్రికి తరలించారు. మహేష్​ పరిస్థితి విషమంగా పేర్కొన్న వైద్యులు… అతడి హెల్త్​ బులెటిన్​ కొన్ని గంటల తరువాత వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఆస్పత్రి వద్దకు మహేష్​ బంధువులు, స్నేహితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు.

About Author