NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్రీడి ఫార్ములతోనే జీవితంలో విజయం

1 min read

సాంఘిక సంక్షేమ,జాయింట్ డైరెక్టర్ వి.జయ ప్రకాష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: సాధించాలనే కోరిక, సంకల్పం, క్రమశిక్షణలతో కూడిన త్రోడి ఫార్ములా పాటిస్తే ఏ విద్యార్థి అయినా జీవితంలో విజయం సాధిస్తారని ఏలూరు జిల్లా సాంఘిక సంక్షేమ, జాయింట్డైరెక్టర్ వి.జయ ప్రకాష్ అన్నారు. స్థానిక అమీనాపేటలో గల బాలికల వసతిగృహ ప్రాంగణంలోఏ.ఎస్.డబ్ల్యూ ఏలూరు ఏరియాలో గల 10వ తరగతివిద్యార్థులకు ప్రేరణాతరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతిపుస్తకాలు బాగా చదివినవారు అన్ని పోటీ పరీక్షలో సఫలమవుతారని, సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల-ల్లోనూ, పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ, ట్రిపుల్ ఐటీకాలేజీలోమ సీట్లు సాధిస్తారన్నారు.  సాంఘిక సంక్షేను కార్యాలయ సూపరింటెండెంట్ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ జవాబులుపదే పదే పునశ్చరణ చేయడం ద్వారా ఎక్కువ మార్కులుసాధిస్తారన్నారు. ఏ.ఎస్.డబ్ల్యూ  బి.రమేష్ మాట్లాడుతూ ఉన్నత విద్యకు 10వ తరగతే మొదటి మెట్టని, కాఉన్న విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధించాలన్నారు.కార్యక్రమంలో ఈ.ఎం.హెచ్.సి ఏలూరు, 1, డబ్ల్యూ హెచ్ ఓ కొవ్వలి,  కూచింపూడి, ఏలూరు బాలికల వసతిగృహ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. వసతిగృహ వార్డెన్స్ వి. విజయలక్ష్మి, సత్యనారాయణ, రామారావు, సురేష్, రాజాబాబు, రాధాదేవి, ఆర్.ఎస్ మంగళ వెంకటేశ్వరమ్మ,మెంటార్స్ రాగోలు రామారావు, లక్ష్మణ కుమార్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

About Author