ప్రజాస్వామిక విప్లవం రాబోతోంది : అఖిలేష్ యాదవ్
1 min readపల్లెవెలుగు వెబ్ : యూపీలో 2022లో ప్రజాస్వామిక విప్లవం రాబోతోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. భాజాపా పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్నారని అన్నారు. 2022లో వచ్చేది యూపీ అసెంబ్లీ ఎన్నికలు కదని, ప్రజాస్వామిక విప్లవమని అఖిలేష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో 403 సీట్లకు గాను.. 350 సీట్లు గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో అణచివేతకు గురైన వర్గాలు ఏకమై కొత్త రాజకీయాలకు పురుడు పోస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఎస్పీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.