NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రక్త హీనత నివారణ కోసమే ఆల్బెండజోల్..

1 min read

బాలికల జడ్పీహెచ్ఎస్, కేజీబీవీలో మాత్రల పంపిణీ..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బాలికల్లో రక్తహీనతను నివారించడం కోసమే ఆల్బెండజోల్ మాత్రలు అవసరమని నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ అన్నారు. జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బాలికల జిల్లా పరిషత్ మరియు అంగన్వాడీ విద్యార్థులకు మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ విద్యార్థులకు వేశారు.ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలు తప్పని సరిగా వేసుకోవాలని 19 సం.ల లోపు  ఉన్న వారికి మాత్రలు వేయాలని మున్సిపాలిటీ కమిషనర్ అన్నారు.అదే విధంగా మిడుతూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు ఎంపీడీఓ పి దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు.అంగన్వాడీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి నూలి పురుగుల నివారణ కోసం మాత్రలు వేయాలని ఎంపీడీవో,తహసిల్దార్  అన్నారు. నటి రోజున మాత్రలు వేసుకోని ఈనెల 17వ తేదీన వారికి మాత్రలను ఇస్తామని ఆరోగ్య సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అర్బన్ సెంటర్ డాక్టర్ గాయత్రి,సూపర్వైజర్ కొత్తూరమ్మ,ఈఓఆర్డి సంజన్న, కేజీబీవీ ఎస్ఓ విజయలక్ష్మి, ఎంఎల్ హెచ్ పీ డి.మీనా, ఏఎన్ఎం కే జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

About Author