NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలకు సహకరించిన వారికి సత్కారం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  హొళగుందశ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలకు – సంబంధించి పారిశుద్ధ్య, వీధిలైట్లు తదితర ఏర్పాట్లపై గ్రామపంచాయతీ సిబ్బంది. మరియు సర్పంచ్ సేవలు కొనియాడ తగ్గవని అందులోనూ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మాజీ సర్పంచ్ రాజా పంపన గౌడ తనయుడు సిద్ధార్థ్ తదితరులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ తన సిబ్బందితో వారం రోజుల పాటు జరిగిన సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలలో గ్రామపంచాయతీ సిబ్బందితో వీధిలైట్లు, పారిశుద్ధ్య, లంక దహన పరిసర ప్రాంతంలో తగిన ఏర్పాట్లు చేయడంతో మా వంతుగా సత్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా రథోత్సవ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి సహాయ సహకారాలు ఎస్సై బాల నరసింహులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలియజేస్తూ రథోత్సవ ఉత్సవాలు దిగ్విజయం చేసిను గ్రామ పెద్దలకు, ఆశేష ప్రజానీకానికి, ప్రతి అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణుకా రాధ్య, మరే గౌడ, రవికాంత్, గ్రామపంచాయతీ సిబ్బంది. వీరభద్ర, మాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author