ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి..
1 min readఏపీ ఎన్జీజీవోస్ సంఘ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోవాలని, ఫారం 12 ని జమ చేయడానికి 26 ఏప్రిల్ 2024 ఆఖరి రోజు కాబట్టి, ఎన్నికల విధులకు నిర్దేశింపబడిన సిబ్బంది అందరూ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు జమ చేయాలని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా జేఏసీ చైర్మన్ ఏపీ ఎన్జీవోస్ జిల్లా సంఘ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులందరూ ఏ నియోజకవర్గంలో ఓటు ఉన్నా గానీ సంబంధిత పనిచేస్తున్న నియోజకవర్గ ఫెలిసిటేషన్ సెంటర్లోనే ఓటు వేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్న ఫేలిటేషన్ సెంటర్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఆర్వో కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. మే 5న జరుగు పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో ఉద్యోగుల హాజరవ్వటానికి వీలుగా స్పెషల్ క్యాజువల్ లీవ్ ను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఫారం 12 ను జమ చేయడానికి ఎటువంటి సాంకేతిక మరే ఇతర ఇబ్బందులు ఉన్నా ఎన్జీవో సంఘ కార్యాలయాన్ని. కార్యవర్గ సభ్యులు ని సంప్రదించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని. ఎన్జీవోస్ అసోసియేషన్ తరపున అధ్యక్ష, కార్యదర్శులు కోరారు.