వినియోగదారుడు నష్టపోకుండా విధి నిర్వహణ
1 min read
సకాలంలో సేవలందించడానికి నిత్యం వందల కిలోమీటర్ల ప్రయాణం
ఆరోగ్యం సహకరించకపోయినా, ఏ ఒక్క చోట కూడా రాజీ పడకుండా వృత్తి ధర్మం
పెట్రోలు బంకుల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు
తూనికలు కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కంట్రోలర్ పగడాల సుధాకర్
పల్లెవెలుగు , అనంతపురం: వినియోగదారుడు నష్టపోకుండా ఉండడం కోసం చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నానని తూనికలు కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కంట్రోలర్ పగడాల సుధాకర్ పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల్లో కొలతల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తమ శాఖ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు అందరూ కూడా వినియోగదారుల శ్రేయస్సు ముఖ్యమని భావించి అంకితభావంతో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విధినిర్వహణలో ఎక్కడ కూడా రాజీ పడకుండా పనిచేస్తున్నామని అన్నారు. వినియోగదారులకు కొలతలు మరియు తూనికల్లో ఎక్కడైనా మోసం జరుగుతోందని తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆరోగ్యం సహకరించకపోయినా కూడా డీలర్లకు మరియు వినియోగదారులకు సకాలంలో సేవలు అందించాలని, ఎక్కడా కూడా జాప్యం జరగకూడదని ఉద్దేశంతో నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో అవకతవకలు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తూనికలు, కొలతల్లో తేడాలు లేకుండా చూడడమే తమ విధి అని ఆయన పేర్కొన్నారు. తాను ఉద్యోగంలో చేరకముందు వినియోగదారుడుగా చాలా చోట్ల మోసానికి గురయ్యానని, మోసానికి గురైనప్పుడు వినియోగదారుడు పడే బాధ తనకు ప్రత్యక్షంగా తెలుసునని అన్నారు. అందుచేత వినియోగదారుడు ఎక్కడ కూడా మోసానికి గురి కాకుండా, విధి నిర్వహణలో ఎక్కడ ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ బంకుల్లో తేడాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మరి మరి గుర్తు చేశారు.