శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు
1 min read
మహానంది, న్యూస్ నేడు: శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. మహానంది క్షేత్రానికి ఉదయం నుండే భక్తులు రావడం ప్రారంభమైంది. మధ్యాహ్న సమయానికి భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం నుండి కాలినడకన వివిధ వాహనాల్లో క్షేత్రంలో జరిగే లింగోద్భవ కార్యక్రమం వీక్షించడానికి అశేష జన వాహిని ప్రవాహం లా తరలివచ్చారు. చిత్రంలో ఉదయం వేదమంత్రో చరణాలు మంగళ వాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం క్షేత్రంలో యధావిధిగా జరిగే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం రాత్రి ఆలయ శుద్ధి అనంతరం లింగోద్బావ కార్యక్రమాన్ని మంగళ వాయిద్యాలు వేదమంత్రోత్సవాల మధ్య నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కార్యక్రమం దాదాపు రెండు గంటల సమయంలో శుక్రవారం తెల్లవారుజామున ముగిసింది. లింగోద్భవ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో భక్తులను అనుమతించి యధావిధిగా పూజ కార్యక్రమాలను నిర్వహించారు. లింగోద్భవ కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అశేష జన భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తాసిల్దార్ రమాదేవి ఏఈఓ మధు నంద్యాల ఏ ఎస్ పి జావలి, వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ శాంతారాం బట్ తదితరులు పాల్గొన్నారు.
