వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును కేంద్రం ఆమోదించేందుకు చంద్రబాబు, పవన్ కృషి చేయాలి
1 min read
ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మన్న
మంత్రాలయం, న్యూస్ నేడు : వాల్మీకి బోయ ఎస్టీ బిల్లు ను కేంద్రం ఆమోదించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేయాలని ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మన్న కోరారు శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 1956 వరకు వాల్మీకి బోయలందరూ ఎస్టీలుగా గుర్తింపబడేవారన్నారు. అప్పటి ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా వాల్మీకి బోయలను ప్రాంతాలవారీగా విభజించి పాలించడం జరిగిందన్నారు. ఉభయగోదావరి జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలోని వాల్మీకి బోయాలను ఎస్టీలుగా గుర్తించి మిగిలిన జిల్లాలలోని వాల్మీకి బోయలను బీసీ ఏ లుగా గుర్తించారని తెలిపారు. వాల్మీకి బోయలకు జరిగిన అన్యాయం గురించి మా ముందు తరం వారు కూడా పోరాటం చేశారని తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం మేము కూడా 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు వాల్మీకుల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి బోయాల స్థితిగతులను విచారించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందన్నారు. అదే సమయంలో అప్పటి ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెమ్ శివాజీ తో కూడా వాల్మీకి బోయల స్థితిగతులపై అధ్యయనం చేయించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సమర్పించడం జరిగిందని తెలిపారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఎన్ చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్య మంత్రి హోదాలో రాష్ట్ర అసెంబ్లీలో ఎస్టీ బిల్ గురించి చర్చించి అసెంబ్లీలో వాల్మీకి బోయల ఎస్ టి బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం వాల్మీకుల బోయల ఎస్టీ బిల్లు కేంద్రంలో పెండింగ్లో ఉంది గనుక ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాల్మీకి బోయల ఎస్టీ బిల్లుపై ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో చర్చించి వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును లోక్ సభ లోను, రాజ్యసభలోను వాల్మీకుల ఎస్టీ బిల్లును ఆమోదించే విధంగా గట్టి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ తమకు సమయం ఇచ్చినప్పుడు వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు గురించి గళమెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీలు కూడా పెద్దల సభలో వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు గురించి మా తరఫున గళం వినిపించాలని కోరుతున్నామని తెలిపారు. ఈసారి తప్పకుండా వాల్మీకి బోయల ఎస్టి బిల్లు కేంద్రంలో పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే చంద్రబాబు, పవన్ వీరిద్దరూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత సన్నిహిత సంబంధం ఉందన్నారు. కూటమి లో నరేంద్ర మోడీ వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు గురించి ఒక్క మాట చెబితే చాలు వాల్మీకి బోయల ఆశలు నెరవేరినట్లే నని భావిస్తారు అని అన్నారు. ఈ సమావేశంలో వాల్మీకి ముఖ్య నాయకులు బివి రవిచంద్ర, బి రాఘవేంద్ర, బి వరప్రసాద,జి వెంకటేష్, జి దుల్లయ్య, అంజి, గిడ్డయ్య, అడవిరాగు, పవన్ తదితరులు ఉన్నారు.