రీ సర్వే లో లోపాలు లేకుండా సమగ్రంగా నిర్వహించాలి
1 min read
రీ సర్వే కు ముందుగా రైతులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలి
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామములో రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: పైలెట్ గ్రామాల్లో నిర్వహిస్తున్న రీ సర్వే లో లోపాలు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సర్వే మరియు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రీసర్వే పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో రీ సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కడిమెట్ల గ్రామ పొలాల్లో రీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో రీ సర్వే నిర్వహించేటప్పుడు ముందుగా రైతులకు నోటీసులు ఇచ్చి, తగిన సమయం ఇవ్వాలని, తదుపరి వారి సమక్షంలోనే భూములను సర్వే చేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రీ సర్వే పక్కాగా, పర్ఫెక్ట్ గా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్కడే ఉన్న రైతులు గొల్ల కేశన్న, గొల్ల చెన్నయ్య ల తో కలెక్టర్ మాట్లాడారు.. రైతులతో మాట్లాడుతూ సర్వే చేయడానికి ముందే మీకు నోటీసులిచ్చారా? మీకు పాస్ పుస్తకాలు ఉన్నాయా? రీ సర్వేలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని కలెక్టర్ ఆరా తీశారు.. అనంతరం అధికారులతో మాట్లాడుతూ సర్వే చేసేటపుడు భూమి విస్తీర్ణంలో ఏమైనా తేడాలు వచ్చాయా అని ఆరా తీశారు..ఫీల్డ్ స్టోన్స్ గురించి మండల సర్వేయర్ లు విలేజ్ సర్వేయర్ లకు క్షుణ్ణంగా వివరించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రోవర్ ద్వారా భూమిని కొలిచే తీరును కలెక్టర్ పరిశీలించారు..అనంతరం రికార్డులను పరిశీలించారు.. RSR, 1B, Old ROR, అడంగల్, FMB, 10 వన్ రికార్డులను పరిశీలించి, రికార్డుల నిర్వహణ ఎలా చేయాలి అని వివరించారు..రీ సర్వే కు సంబంధించిన రికార్డ్స్, సర్వే మ్యాప్ లను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు..ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సర్వే ఏడి ముని కన్నన్, తహసిల్దార్ శేష ఫణి, సర్వేయర్లు, వీఆర్వోలు,తదితరులు పాల్గొన్నారు.