పింఛన్లను పంపిణీ చేసిన శివరామిరెడ్డి..
1 min read
నందికొట్కూరులో 90, మిడుతూరులో 91 శాతం పింఛన్ల పంపిణీ
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలం లో 19 గ్రామ పంచాయతీల్లో వివిధ ఎన్టీఆర్ భరోసా వివిధ రకాల పింఛన్లను వివిధ శాఖల అధికారులు పంపిణీ చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుండి అన్ని గ్రామాల్లో పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అధికారులు నగదును అందజేశారు. అదేవిధంగా తలముడిపి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు వంగాల శివరామిరెడ్డి పింఛన్ల నగదును వృద్ధులకు అందజేశారు.గత నెలలో భర్త మరణించడంతో ఆయన భార్యకు మరుసటి నెలలోనే పింఛన్ మంజూరు చేసి ఇవ్వడం జరిగిందని శివరామి రెడ్డి అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేటట్లు చూస్తామని ఆయన అన్నారు. బైరాపురం గ్రామంలో టీడీపీ నాయకులు మొల్ల చాఖర్ వలి మరియు పంచాయతీ కార్యదర్శి పింఛన్లను పంపిణీ చేశారు.అదే విధంగా మిడుతూరు మండలంలో 5315 పింఛన్లకు గాను 4845 పింఛన్లు అందించడం జరిగింది.91 శాతం పింఛన్లు పంపిణీ చేశామని ఎంపీడీవో పి దశరథ రామయ్య తెలిపారు. నందికొట్కూరు పట్టణంలో 90 శాతం,నందికొట్కూరు రూరల్ లో 90 శాతం,పగిడ్యాలలో 88 శాతం,జూపాడు బంగ్లాలో 92 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు మండల అధికారులు తెలిపారు.