NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన…కర్నూలు డిఎస్పి  జె. బాబు ప్రాసద్

1 min read

తప్పిపోయిన బాలికను గంటలో వెతికి అప్పగించిన కర్నూలు మూడవ పట్టణ పోలీసులు.

పోలీసులకు కృతజ్ఞతలు తెల్పిన బాధితులు.

కర్నూలు, న్యూస్​ నేడు:  నాగి రెడ్డి రెవెన్యూ కాలనీ లో నివాసం వుండే  శిరీష  కూతురు  “ హిమ “ 4 సంవత్సరాల  పాప వారి ఇంటి వద్ద ఆడుకుంటు అలాగే  బయటికి  వెళ్ళింది అని ఎంత సేపటికి  తిరిగి రాలేదు. వారు చుట్టూ పక్కల వెతికినా ఎక్కడ  కనబడనందున వారు వారి పాప  హిమ  కనిపించడం లేదని కర్నూల్ 3 టౌన్ పోలీస్ వారికి  సమాచారం  ఇచ్చారు. వెంటనే  కర్నూల్ టౌన్  డిఎస్పి శ్రీ  జె. బాబు ప్రసాద్  ఆద్వర్యంలో  కర్నూల్ 3 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ. పి.శేషయ్య  తన సిబ్బంది ని 03 బృందాలుగా  పంపి  ఎస్​ఐ  మన్మద్ విజయ్  ఒక బృందంగా , హెడ్ కానిస్టేబుల్స్  రంగా రావు, రాంబాబు, చెంచన్న లు  ఒక బృందంగా మరియు హెచ్​సి-హనుమంతు, పిసి-నాగేశ్వరరావ్ అను వారులు  బృందాలుగా ఏర్పడ్డారు.కర్నూలు 3 వ పట్టణ పోలీస్ స్టేషన్  పరిధిలో  పాప ఆచూకీ కోసం  వెతుకుతుండగా  నంద్యాల చెక్ పోస్టు కి దగ్గరలో ఉన్న గుడ్ షప్పర్ట్ స్కూల్  వద్ద పాప యొక్క ఆచూకీ  కనుగొన్నారు.పాప యొక్క తల్లి శిరీష ను  కర్నూలు టౌన్  డిఎస్పీ ఆఫీసు వద్దకు  పిలిచి “  హిమ “ 04 సంవత్సరాల పాపను కర్నూల్ టౌన్  డిఎస్పి  శ్రీ  జె. బాబు ప్రసాద్  ఆమె తల్లికి  పాప ( హిమ) ను అప్పగించినారు.

About Author