పది’లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి:డిఈఓ
1 min read
వెనకబడిన విద్యార్థులను గుర్తించండి
నందికొట్కూరు, న్యూస్ నేడు: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల జిల్లా పరిషత్ పాఠశాలను డీఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డీఈఓ విద్యార్థులతో సమావేశమై పరీక్షలు సమీపిస్తున్నాయని మంచిగా చదువుకొని ప్రతి సబ్జెక్టులో కూడా మంచి మార్కులు వచ్చే విధంగా పరీక్షలు బాగా రాయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.మీకు ఏమైనా అసందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచిస్తూ వారితో మాట్లాడారు.విద్యార్థులు ఏఏ సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారో వారిని గుర్తించి విద్యలో వారు ఇంకా ముందడుగు వేసే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.అదే విధంగా ఆరోగ్యం పట్ల మరియు మధ్యాహ్న భోజన పథకంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే వాటి గురించి వివరించారు.భోజనములో మెనూ ప్రకారం నాణ్యతగా ఉండాలని ఉపాధ్యాయులకు మరియు వంట నిర్వాహకులకు సూచించారు. కెమిస్ట్రీ ల్యాబ్ మరియు క్రీడామైదానాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎంఈఓ సుభాన్,పాఠశాల ప్రధానో పాధ్యాయులు శ్రీరామ చంద్రమూర్తి మరియు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

