వివాహ బంధానికి ముగింపు.. విడిపోతున్న అమీర్ ఖాన్, కిరణ్ రావు
1 min readపల్లెవెలుగు వెబ్ : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కిరణ్ రావు.. 15ఏళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. జీవితంలో కొత్త ప్రయాణం కోసం విడిపోతున్నట్టు అమీర్ ఖాన్ దంపతులు ప్రకటించారు. మొదటి భార్య రీనా దత్తతో విడాకుల అనంతరం కిరణ్ రావును .. అమీర్ పెళ్లి చేసుకున్నారు. అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాకి కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్లి జరిగింది. 15 ఏళ్లు పాటు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాగిన జీవితం.. విడాకులతో ఆ బంధానికి ముగింపు పలకనుంది. వీరిద్దరికి ఆజాద్ అనే కొడుకు ఉన్నాడు. కొడుకు బాధ్యత ఇద్దరం కలిసి తీసుకుంటున్నట్టు అమీర్ ఖాన్ దంపతులు ప్రకటించారు. పానీ ఫౌండేషన్, ఇతర విషయాల్లో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు ఆ స్టార్ దంపతులు తెలిపారు.