PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కత్తితో బెదిరించి.. చీర దొంగ‌త‌నం చేశాడు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మ‌ధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. బెదిరించి డ‌బ్బో, బంగార‌మో, వాహ‌న‌మో దోచుకెళ్లడం చూశాము. కానీ ఈ దొంగ క‌త్తితో బెదిరించి ఓ చీర దొంగ‌త‌నం చేశాడు. ఈ చీర దొంగ‌ను 24 గంట‌ల్లోపే ప‌ట్టుకున్న పోలీసులు..క‌ఠిన‌మైన జాతీయ భ‌ద్రత చ‌ట్టం కింద కేసు నమోదు చేయ‌డం గ‌మ‌నార్హం. గురువారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ఉజ్జయిని ట‌వ‌ర్ సెంట‌ర్లో చీర‌ల దుకాణానికి వెళ్లిన ఓ యువ‌కుడు క‌త్తితో బెదిరించాడు. అడ్డుకోబోయిన వారిని ప‌క్కకు నెట్టాడు. దుకాణంలో డ‌బ్బు ఇత‌ర వ‌స్తువులు దొంగ‌త‌నం చేయ‌కుండా కేవ‌లం ఒక చీర మాత్రమే దొంగ‌త‌నం చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విక్కీ అనే పాత నేరస్థుడు ఈ ఘ‌ట‌న‌కు పాల్పడిన‌ట్టు పోలీసులు తెలిపారు.

About Author