గూడూరులో భారీ వర్షం…
1 min read– ఉప్పొంగిన వాగులు వంకలు.. నిలిచిన వాహనాల రాకపోకలు
పల్లెవెలుగు వెబ్, గూడూరు: గూడూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని పొన్నెకల్లు వాగు, పెంచికలపాడు వంక ఉప్పొంగి ప్రవహించాయి. పంట పొలాలు వర్షపునీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖరీఫ్ సీజన్లో భారీ వర్షం కురవడంతో రైతన్నల ఆశలు చిగురించాయి. గూడూరు పట్టణంలోని ఎరువుల దుకాణాలన్నీ విత్తనాలు కొనేందుకు రైతన్నలు బారులు తీరారు.