బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
1 min read
ఏలూరు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏలూరు పట్టణం లో హోటల్ అంబికా ఫ్లేవర్స్ నందు అత్యంత వైభవం గా జరిగాయి. కార్యక్రము లో రాష్ట్ర అధ్యక్షులు గా గుంటూరు కు చెందిన కోనూరు సతీష్ గా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కర్నూలు కు చెందిన హెచ్.కే మనోహర రావు లు తో పాటు కర్నూలు కు చెందిన కల్లె చంద్రశేఖర్ శర్మ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గా, ఇస్కాల సురేష్ కుమార్ ఉపాధ్యక్షులు గా, పెనుగొండ సుందర రామశర్మ యువజన విభాగం ఉపాధ్యక్షులు గా,సంబరాజు దుర్గ ప్రసాద్, మరియు కొత్తపల్లి శ్రీనాథ్ లకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ప్రమాణం చేశారు.కర్నూలు జిల్లా కు రాష్ట్ర స్థాయి పదవులు దక్కడం పట్ల వారు హర్షము వ్యక్తం చేశారు. తాము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అభివృద్ధి కి తద్వారా బ్రాహ్మణ సమాజం సంక్షేమము కొరకు కృష్ణ చేస్తామని కర్నూలు జిల్లా లో బ్రాహ్మణ సమాజం లో ఏవైనా సమస్యలు వున్న తమ ద్రుష్టి కి తీస్తే రాష్ట్ర నాయకులతో చర్చించి సమస్య పరిస్కారం దిశ గా కృషి చేస్తాం అని తెలిపారు. తమ సేవా లను గుర్తించి తమను రాష్ట్ర స్థాయిలో సేవా చేసే అవకాశం కల్పించిన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో అంబికా దర్బార్ బత్తి ల అధినేత అంబికా కృష్ణ , బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి ముఖ్య అతిధులు గా విచ్చేసారు. డోన్ పట్టణం కు చెందిన శతవధాని గండ్లురు దత్తాత్రేయ శర్మకి, ఆధ్యాత్మిక అనుష్టానవేత్త,శ్రీ గుండు రామనాథ్ శాస్త్రి ( బెలడోనా స్వామి ) వుగాది పురస్కారాలు అందించారు.
