PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం….

1 min read

ప్రజాదరణతోనే వైఎస్సార్సీపీ కి 40 శాతం ఓట్లు : మాజీ పార్లమెంటు సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక  మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :   ఎమగనూరు పట్టణంలో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నందుకే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, పార్టీ శ్రేణులు అధైర్య పడవద్దని, అండగా ఉంటామని కర్నూలు జిల్లా మాజీ పార్లమెంటు సభ్యురాలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుకగారు, మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి  భరోసానిచ్చారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (శిల్పా ఎస్టేట్) కార్యాలయం నందు ఎమ్మిగనూరు పట్టణ వైఎస్సార్సీపీ శ్రేణుల విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మాజీ పార్లమెంటు సభ్యురాలు,ఎమ్మిగనూరు నియోజవర్గ ఇన్ చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక , మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి  వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. ప్రత్యర్థి కూటమిలోని మూడు పార్టీలు కలిసి తప్పుడు ప్రచారం, మోసపూరిత హామీలతో అధికారం చేజిక్కించుకున్నారని విమర్శించారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీ శ్రేణులు పట్టణంలో పార్టీ బలోపేతానికి పాటు పడాలని సూచించారు. పార్టీలు మారుతారన్న పుకార్లను నమ్మవద్దని సూచించారు. అబద్దపు ప్రచారం, అసంబద్ధ హామీలతోనే చంద్రబాబు గద్దెనెక్కారని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అబద్దాలు చెప్పలేక ఓడిపోయారన్నారు. పట్టణంలో ఎవరూ టీడీపీకి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఎ‌దుర్కోందామన్నారు. గెలుపొందిన కూటమి నాయకులు హామీల అమలు పై దృష్టి సారించాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పట్టణ పార్టీ శ్రేణులు ఐక్యతతో పని చేసి ఆయా ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు  బుట్టా శివనీలకంఠ , మాజీ రాష్ట్ర లింగయాత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ , మండల కన్వీనర్ బి.ఆర్ బసిరెడ్డి , యువ నాయకులు బుట్టా ప్రతూల్ , మాజీ రాష్ట్ర శాప్ నెట్వర్క్ చైర్మన్ మాచాని వేంకటేష్ ,  మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్ రఘు , వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ మెంబర్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, మైనార్టీ నాయకులు, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

About Author