సాయి అనాధ ఆశ్రమాన్ని తనిఖీ చేసిన న్యాయమూర్తి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి , మరియు LSUM కమిటీ సభ్యులైన శివరాం, డిప్యూటీ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్, రాయపాటి శ్రీనివాసులు, పారా లీగల్ వాలంటీర్ లు కలసి బుధవారం నాడు కర్నూలు బుధవారపేట నందు గల సాయి అనాధ ఆశ్రమాన్ని తనిఖీ చేయడం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో తనిఖీ చేపట్టారు. ఆశ్రమంలోనీ నిరాశ్రయులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనాధ ఆశ్రమంలో పరిశీలించడానికి సరైన రికార్డులు లేవని అలాగే పరిశుభ్రతను పాటించడం లేదని అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనాధాశ్రమానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోలేదని వారిని మందలించారు, ఇకనుంచైనా రికార్డులను మెయింటైన్ చేస్తూ అనాధ ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.