ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ఒకరు మృతి నలుగురికి గాయాలు
1 min read
చెన్నూరు , న్యూస్ నేడు: కడప- కర్నూలు జాతీయ రహదారి చెన్నూరు కొత్త రోడ్డు చర్చి సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు అరుంధతి నగర్ కు చెందిన లక్ష్మీ గాండ్ల బాలమ్మ, తుమ్మలూరు సుబ్బమ్మ, వెంకటసుబ్బమ్మలు ప్రతిరోజు కడప నగరంలోని గోకుల్ లాడ్జి వద్ద గల ఉడిపి హోటల్ నందు పనిచేయుటకు వెళ్లేవారని తెలిపారు. అలాగే ఎద్దుల వెంకటేష్ అనే వ్యక్తి రోజువారి పని నిమిత్తం వెళ్లే వారని అయితే బుధవారం తెల్లవారుజామున పాలెం రాజు అనే వ్యక్తి ఆటోలో వీరు నలుగురు కడప కు బయలుదేరగా ఆటో చెన్నూరు కొత్త రోడ్డు వద్ద నుండి చర్చి సమీపానికి రాగా మైదుకూరు నుండి కడపకు వెళుతున్న గుర్తు తెలియని వాహనం అతివేగంగా అతి జాగ్రత్తగా ఆటోను వెనుక భాగంలో డీ కొనడంతో ఆటో లో ప్రయాణిస్తున్న లక్ష్మీ గాండ్ల బాలమ్మ (59 ) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఎద్దుల వెంకటేష్ , తుమ్మలూరు సుబ్బమ్మ, వెంకటసుబ్బమ్మ, ఆటో డ్రైవర్ పాలెం రాజుకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కాగా వీరిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించగా ఆటో డ్రైవర్ రాజు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొరకు తిరుపతికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు లక్ష్మీ గాండ్ల బాలమ్మను శవ పరీక్ష నిర్వహించి వారి బంధువులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.