మట్టి నమూనా సేకరణ.. పొలం ఆరోగ్యం పై పరీక్షలు..
1 min readఏవో హేమ సుందర్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : పొలం ఆరోగ్యం పై శనివారం నాడు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిలకల గూడూరు గ్రామంలో ఐదు ఎకరాల యూనిట్ గా దాదాపు 588 మట్టి నమూనా సేకరించారు రైతు సోదరుల ఆధ్వర్యంలో ఐదు ఎకరాల ఒక యూనిట్ గా గట్ల దగ్గర మరియు గుంతపొలాల్లో కాకుండా చదునుగా ఉన్నటువంటి పొలాల్లో 15 చోట్ల మట్టి సేకరించి మట్టి నమూనా ను ఏ విధంగా రైతు పొలం యందు సేకరించాలో రైతు సోదరులకు చూపించటం జరిగిందన్నారు. మట్టిని కవర్లో వేసి అందులో ఒక చీటీ పైన రైతు పేరు.తండ్రి పేరు, ఫోన్ నెంబరు ,గ్రామం , మండలము రాసి సంబంధిత ఆర్.బి.కె సిబ్బందికి అందజేసినచో వాటిని మట్టి ప్రయోగశాల యందు పరీక్ష చేసిన తర్వాత ఫలితాలను నేరుగా వారు రైతు యొక్క ఫోన్ నెంబర్ కి రిపోర్టు పంపడం జరుగుతుందని ఈ నమూనాల వల్ల. నేల యొక్క సారవంతాన్ని తెలుసుకోవడం. పోషకాల ఆవశ్యకత . సమస్యాత్మక నేలలు బాగు చేయటం కోసం సమగ్ర సమతుల ఎరువుల యాజమాన్యాన్ని పాటించటం మొక్క నిలబడటానికి, నీరు పోషకాలు అందించుట. మట్టి యందు చేసే పరీక్షలు.ఉదజని.లవణాలు. సేంద్రియ కర్బనము ముఖ్య పోషకాలు నత్రజని,భాస్వరం, పొటాష్ ఉప పోషకాలుక్యాల్షియం , సల్ఫర్.మెగ్నీషియం .సూక్ష్మ పోషకాలు.జింకు ,కాపార్, ఐరన్, మ్యాంగనీస్ ,బోరాన్, మా లిబ్దినం, క్లోరిన్, సోడియం, కోబాల్ట్. తదితర పోషకాలు అంది రైతు పొలంలో పంట ఏపుగా పెరిగి లాభాలను తెచ్చిపెడుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.