అన్ని వర్గాలకు సమన్యాయం కూటమితోనే సాధ్యం
1 min read
ఎస్సీ వర్గీకరణ ఆ వర్గాలకు ఎంతో మేలు చేస్తుంది
ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
పత్తికొండ , న్యూస్ నేడు : రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కె.ఈ .శ్యామ్ కుమార్ అన్నారు. గురువారం పత్తికొండ టిడిపి కార్యాలయంలో టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల తిరుపాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం మొదలైన రోజే వర్గీకరణకు తన వంతు సహకారం అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వర్గీకరణ ఆయన హయంలోనే చేశారన్నారు. గత వైసిపి హాయంలో రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబాటుకు గురైందని రేషన్ గుంతలు పడ్డ రోడ్లకు గంపెడు మట్టి కూడా వేయని దుస్థితిలో పాలన సాగింది అన్నారు. దీంతో చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు టిడిపికి పట్టం కట్టారున్నారు.అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు వెచ్చించి రహదారులు మరమ్మతులు చేశారని. గ్రామ గ్రామాన సిసి రహదారులు ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుదల ఉచిత గ్యాస్ సిలిండర్ లో అందించారన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు పాలనలో రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుస్తుంది అన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు రామానాయుడు. ఎస్సీ సెల్ నాయకులు బోనాల కాశి హోసురుఅంజి, ఉచ్చిరప్ప కడవల సుధాకర్, రాంపల్లి తిరుపాలు,హోటల్ సుధా ,శ్రీనివాసులు గౌడ్, జగ్గిలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.