20 న నాగలూటిలో విగ్రహ ప్రతిష్ట..
1 min read
ప్రత్యేక అలంకరణగా నూతన దేవాలయం..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో ఈనెల 20వ తేదీన విగ్రహ ప్రతిష్ట ఉన్నట్లు దేవాలయ కమిటీ నిర్వాహకులు మరియు ప్రజలు తెలిపారు.గ్రామంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక సహిత శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయమును నిర్మించారు. ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా దేవాలయాన్ని ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. ఆదివారం ఉదయం 10:41 ని.కు దేవాలయ ప్రతిష్ట మహోత్సవం జరగనుందని తెలిపారు.ఈరోజు అనగా 18వ తేదీ ఉదయం గజపతి పూజ సాయంత్రం నవగ్రహ మహోత్సవములు 19న ప్రాతకాల ప్రభాత పూజలు యంత్ర విగ్రహ అభిషేకములు మధ్యాహ్న మూడు గంటలకు గ్రామంలో విగ్రహములను ఊరేగింపు,సాయంత్రం ప్రదోష పూజలు ధాన్య దినము హోమం 20న ప్రాతకాల ప్రాత కాల పూజలు హోమం యంత్ర విగ్రహ అభిషేకములు జరుగుతాయని కమిటీ నిర్వాహకులు తెలిపారు.