మానవత సంస్థకు విలువలు ఎంతో అవసరం
1 min readమానవత కేంద్ర కమిటీ సభ్యుడు. టాటాల గోపి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు విలువలు ఎంతో అవసరమని ఆ సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడు టాటాల గోపి పేర్కొన్నారు. చెన్నూరు రామాలయంలో ఆదివారం సాయంత్రం మానవతా సంస్థ నూతన కార్యవర్గం. సర్వే సభ్య సమావేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చెన్నూరు మండలం మానవత స్వచ్ఛంద సేవ సేవ సంస్థ మాజీ అధ్యక్షుడు జి ఎన్. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో టాటాల గోపి మాట్లాడుతూ చెన్నూరు మండలంలో మానవతా సేవా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.350 మంది సంస్థల సభ్యులుగా ఉండడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. సభ్యుల సంఖ్య పెంచేందుకు సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవత సేవా సంస్థ సభ్యులు సమ్మెట సత్యనారాయణ. శివ విష్ణు మోహన్ రెడ్డి. ఎల్లారెడ్డి రాధా మాట్లాడుతూ 2018లో మానవతా సంస్థ రామచంద్రారెడ్డి స్థాపించారని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా మానవతా సంస్థ సేవలందిస్తున్నది అన్నారు. చెన్నూరు మండల వ్యాప్తంగా ఉచిత అంబులెన్స్. ఉచిత శాంతి రథం ఉచిత ప్రెజర్లు ఏర్పాటు చేయడం పట్ల సభ్యులను వారు అభినందించారు. అనంతరం 2014.2015. సంవత్సరానికి కాను కొత్త కార్యవర్గం ఏర్పాటయింది. ఈ కార్యవర్గంలో చెన్నూరు మండలం మానవత సంస్థ అధ్యక్షులుగా ఆవులబసీ రెడ్డి. కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య. కోశాధికారి పెడబల్లె నారాయణరెడ్డి. ఉపాధ్యక్షులుగా నీలం శ్రీనివాసులు రెడ్డి. మరియు పుత్త భయపరెడ్డి. తుమ్మలూరు రవీంద్రనాథ్ రెడ్డి. గుగ్గుల చాణిక్య. వై పాలకొండ రెడ్డి లననుఎన్నుకున్నారు. అనంతరం మానవతా సంస్థకు దాతలుగా సహకరించిన రామనపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీలక్ష్మి. చెన్నూరు పడమటి వీధికి చెందిన జి చాణిక్య. ఆటో బాబు లను రాష్ట్ర జిల్లా మండల మానవత ససంస్థ నాయకులు సభ్యులు దాతలను సాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరవేటి శ్రీనివాసరాజు. తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంస్థ నిర్వాహకులు కార్యక్రమానికి వచ్చిన వారికి అల్పాహార విందు అందించారు.